: ముగ్గురికి బెయిల్ మంజూరు...కాసేపట్లో దీక్ష విరమించనున్న ముద్రగడ
తుని ఘటనలో నిందితులు 13 మందికి బెయిల్ లభించింది. ఈ 13 మందికి బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 13 రోజులుగా కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే పది మందికి బెయిల్ మంజూరు చేయగా, 8 మంది విడుదలయ్యారు. సాంకేతిక కారణాల రీత్యా ఇద్దరు విడుదల కాలేదు. మిగిలిన ముగ్గురుకి కూడా బెయిల్ మంజూరు చేయడంతో వారంతా నేడు బెయిల్ పై విడుదల కానున్నారని సమాచారం. వీరంతా విడుదల కానున్న నేపథ్యంలో కాసేపట్లో ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమించనున్నారని తెలుస్తోంది.