: తమాషాలు చూస్తున్నారు... బూట్లు వేసుకుని అందరూ అక్కడ... సిగ్గులేదా?: అధికారులపై దేవినేని నిప్పులు


"అగ్రికల్చర్ ఆఫీసర్లందరినీ రమ్మనవయ్యా వెళ్లి... అందరూ రండి. మొత్తం ఆఫీసర్లంతా రావాలి. ఆఫీసర్లు మొత్తాన్నీ భూమిలోకి రమ్మనండి. చెప్పులు పక్కనపెట్టి రమ్మనండి. వెళ్లండందరూ పొలంలోకి..." అంటూ దేవినేని ఉమ అధికారులపై నిప్పులు చెరిగారు. తాను పంచెకట్టి ఏరువాక సాగిస్తున్న వేళ, గట్టుపై నిలబడి చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డ ఆయన, "బురదలో నడిస్తే, రైతు బాధేంటో, రైతు కష్టమేంటో, రైతు అప్పేంటో, రైతు కన్నీళ్లేంటో మీ అందరికీ తెలుస్తాయి. రమ్మనవయ్యా... మీ అధికారులను. తమాషాలు చూస్తున్నారు... బూట్లు వేసుకుని అందరూ అక్కడ. పిలవండి మొత్తాన్నీ. అందరూ భూమిలోకి రండి. అందరూ వచ్చి నిలుచోండి. ఆల్ ఆఫీసర్స్ రావాలి. అందరినీ మట్టిలోకి దింపు. భూమిపై ప్రేమ తెలియాలి. షామియానా కింద కూర్చున్నారు. సిగ్గు లేదా?" అని దేవినేని అనడంతో, ఆడా, మగా తేడా లేకుండా అధికారులు చెప్పులు చేతపట్టుకుని పొలంలోకి దిగాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News