: రక్షణరంగంలో 100 శాతం ఎఫ్డీఐ; సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ సర్కారు
అత్యంత కీలక రంగాలైన రక్షణ, విమానయాన రంగాల్లో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తెరలేపుతూ నరేంద్ర మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఈ మేరకు నేడు ఓ ప్రకటనను విడుదల చేస్తూ, ఫార్మా విభాగంలో ఎఫ్డీఐ (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్) పరిమితులను 74 శాతానికి పెంచుతున్నట్టు కూడా తెలిపింది. ఈ మూడు రంగాల్లో ఇప్పటివరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 49 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. రక్షణ రంగంలో పరిమితుల తొలగింపుతో విదేశీ కంపెనీలు ఇండియాకు క్యూ కట్టి, ఇక్కడ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తయారు చేసుకునే వెసులుబాటు కలుగనుంది. రక్షణ రంగంలో ఎఫ్డీఐ పరిమితుల సవరణ చాలా కాలంగా చర్చలలో ఉన్నప్పటికీ, ఇలా నూరు శాతం అనుమతి ఇవ్వడం ఇప్పుడు పెను చర్చకు తెరలేపింది.