: కేవలం 10.4 ఎంఎంతో అత్యంత నాజూకైన ల్యాపీ... రేపు ఇండియాలో విడుదల
హెల్వెట్ - పాకార్ట్ మరో వినూత్న ప్రొడక్టును మార్కెట్ కు పరిచయం చేయనుంది. కేవలం 10.4 మిల్లీమీటర్ల మందంతో 1.1 కిలోల బరువుతో ఉన్న సరికొత్త ల్యాపీని రేపు భారత మార్కెట్లో విడుదల చేయనుంది. దీని ధర 1,249 డాలర్లని (సుమారు రూ. 84 వేలు) తెలుస్తోంది. సిక్స్త్ జనరేషనల్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 13.3 అంగుళాల డిస్ ప్లే, 8 జీబీ ర్యామ్, 512 జీబీ మెమొరీ, హైబ్రీడ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. ఒకసారి చార్జింగ్ తో 9 గంటలా 30 నిమిషాల పాటు నిర్విరామంగా పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. ల్యాపీ విడుదల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన సంస్థ దేశవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలనూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది.