: మోకాలి లోతు బురదలో నాగలిపట్టి దుక్కి దున్నిన చంద్రబాబు


పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని చిట్టవరం గ్రామంలో ఈ సంవత్సరం ఏరువాకను సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించారు. మోకాలిలోతున్న బురదనీటిలోకి దిగిన ఆయన, తలకు పాగా కట్టుకుని, చర్నాకోల చేతిలో ధరించి, కాడెడ్లను అదిలిస్తూ, దుక్కి దున్నారు. అంతకుముందు వేద పండితులు, పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు వరి నాట్లను చేతబట్టి 'ఏరువాకా సాగాలో రన్నో చిన్నన్నా...' అంటూ పాటలు పాడారు. వారికి అభివాదం చేసిన చంద్రబాబు, వరి నాట్ల యంత్రాన్ని స్వయంగా నడుపుతూ, పొలంలో వాటిని గుచ్చారు.

  • Loading...

More Telugu News