: 11 వేల మంది కౌలు రైతుల్లో 11 మందికే రుణాలా?: చంద్రబాబు సర్కారుపై సీపీఐ రామకృష్ణ ఫైర్


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పాలనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన అటు ప్రభుత్వంతో పాటు ఇటు కాంగ్రెస్ పాలనపైనా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 11 వేల మంది ప్రభుత్వ గుర్తింపు పొందన కౌలు రైతులుండగా, వారిలో కేవలం 11 మందికి రుణాలిచ్చి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతుల సంక్షేమం పట్ల దృష్టి సారించని చంద్రబాబు ప్రభుత్వం ఏరువాక పేరిట హడావిడి చేయడం సిగ్గుచేటని ఆయన ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిపోయిందని రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రస్తావించిన ఆయన ... కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి, దాసరి నారాయణరావులు కేంద్ర మంత్రులుగా ఉన్నా కాపులకు వారు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News