: నరసాపురంలో భారీ వర్షం... చంద్రబాబు ఏరువాకకు అడ్డంకులు!
ఈ ఉదయం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలో నైరుతీ రుతుపవనాల కారణంగా భారీ వర్షం పడుతుండటంతో, చంద్రబాబు ఏరువాక కార్యక్రమానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అధికారులు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం బురదమయం కాగా, వచ్చిన వారు కూర్చునేందుకు కాదుకదా, కనీసం నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ఏరువాకను ఘనంగా ప్రారంభించేందుకు ఇప్పటికే మధురపూడి విమానాశ్రయం నుంచి బయలుదేరిన బాబు, మరికాసేపట్లో ఈ సీజన్ పంట పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. వర్షం కురుస్తూనే ఉంటే, ఏరువాకలో మాత్రం పాల్గొనే చంద్రబాబు, బహిరంగ సభను వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.