: ఆర్బీఐ గవర్నర్ పదవి అరుంధతి భట్టాచార్యకేనా?


భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా రఘురాం రాజన్ రెండో విడత బాధ్యతలు చేపట్టేది లేదని తేల్చేశారు. దీంతో రాజన్ కు రెండో టెర్మ్ కూడా ఇస్తారన్న వార్తలకు చెక్ పడిపోయింది. మరి రాజన్ స్థానంలో ఆర్బీఐ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టే ఆర్థిక వేత్త ఎవరు? ఈ అంశంపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఆ పదవిలో నియమితులయ్యేందుకు అన్ని అర్హతలున్న 12 మందితో ప్రభుత్వం ఓ జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా ఉన్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఊర్జిత్ పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేశ్ మోహన్, సెబీ చైర్మన్ యూకే సిన్హా, ఐసీఐసీఐ మాజీ చీఫ్ కేవీ కామత్, వరల్డ్ బ్యాంక్ ప్రధాన ఆర్థిక వేత్త కౌశిక్ బసు, కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. వీరందరిలోకి అరుంధతికే ఆర్బీఐ గవర్నర్ గా పదవీబాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News