: కూతురు ముందే భార్యను పొడిచి చంపి.. ఆపై తాపీగా పోలీసులకు లొంగిపోయిన భర్త!


కన్నకూతురు ముందే తల్లిని అత్యంత కిరాతకంగా హత్యచేశాడో దుర్మార్గుడు. ఆపై తాపీగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి హత్య విషయాన్ని చెప్పాడు. అతడు చెప్పింది విని పోలీసులే షాక్ తిన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిందీ ఘటన. అశోక్ లాల్(35), పూజ(25)లకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్నచిన్న విషయాలకే భార్య తరచూ తనను వేధిస్తుండడంతోపాటు దాడికి దిగుతుండడంతో తట్టుకోలేకే ఆమెను హతమార్చినట్టు అశోక్ పోలీసులకు తెలిపాడు. కన్నకూతురు ఎదురుగానే ఆమెను కత్తితో పొడిచి చంపినట్టు వివరించాడు. ఆమె అరుపులు ఇరుగుపొరుగు వారికి వినిపించకూడదనే ఉద్దేశంతో నోట్లో గుడ్డలు కుక్కడంతోపాటు టీవీ సౌండ్ పెంచినట్టు పోలీసులకు వివరించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న పూజ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News