: ‘బెస్ట్ డ్రెస్స్ డ్ స్పోర్ట్స్ పర్సన్’ కిరీటం సానియాదే!... రెండో స్థానంలో సైనా!
హైదరాబాదీ అమ్మాయిలు క్రీడల్లోనే కాదండోయ్... వస్త్రధారణలో ఆకట్టుకునేలా మెరిసిపోవడంలోనూ సత్తా చాటుతున్నారు. సంప్రదాయ వస్త్రధారణకు సంబంధించి ప్రముఖ ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ ‘మార్కెట్ విల్లా. కామ్’ గత నెలలో నిర్వహించిన ‘బెస్ట్ డ్రెస్స్ డ్ స్పోర్ట్స్ పర్సన్’ కిరీటం హైదరాబాదు అమ్మాయిలే ఎగరేసుకువచ్చారు. లక్షలాది నెటిజన్లు పాలుపంచుకున్న ఈ సర్వేలో హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ కిరీటాన్ని దక్కించుకుంది. ఇక రెండో స్థానంలో కూడా హైదరాబాదుకే చెందిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిలిచింది. ప్రముఖ క్రికెటర్ దినేశ్ కార్తీక్ సతీమణిగానే కాకుండా స్క్వాష్ క్రీడలోనూ జాతీయ స్థాయిలో సత్తా చాటిన దీపికా పల్లికల్ మూడో స్థానంలో నిలిచింది.