: తప్పు దిద్దుకునే అవకాశాన్ని రోజా కోల్పోయారు: స్పీకర్ కోడెల
సభా గౌరవం కోసమే రోజాను సస్పెండ్ చేశామని, రోజా భాష, హావభావాలు బాగుండలేదని, కోర్టు కూడా రోజాను తప్పు పట్టిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. క్షమాపణలు కోరాలని కోర్టు చెప్పినా రోజా వినలేదని, ఆమె నుంచి క్షమాపణలు కోరే లేఖ ఏదీ తమకు అందలేదని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. తప్పుదిద్దుకునే అవకాశాన్ని రోజా కోల్పోయారని, అనర్హతపై వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదులు సరిగా లేవని కోడెల పేర్కొన్నారు.