: నడుస్తూ వెళ్లి బొక్కలో పడిపోయిన పాప్ స్టార్ జస్టిన్ బీబర్
ఓ స్టేజ్ పై ప్రదర్శన ఇస్తున్న వేళ, అభిమానుల హడావుడిలో పడి, స్టేజ్ పై ఉన్న రంద్రాన్ని చూసుకోని పాప్ స్టార్ జస్టిన్ బీబర్, అందులో పడిపోగా, ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కెనడాలోని సాస్కాటూన్ ప్రాంతంలో జరిగిన ఓ ప్రదర్శనలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేజ్ పై నడుస్తూ వచ్చిన బీబర్, స్పెషల్ ఎఫెక్టుల కోసం ముందుగానే ఏర్పాటు చేసిన ఓ హోల్ ను చూసుకోకుండా అందులో పడిపోయాడు. పెద్దగా దెబ్బలు తగలకపోవడంతో, తిరిగి సర్దుకుని ప్రదర్శన కొనసాగించాడు. రెండు నెలల క్రితం కాన్సాస్ లో జరిగిన ఓ ప్రదర్శనలోనూ బీబర్ ఇలాగే పడిపోయిన సంగతి తెలిసిందే. బొక్కలో పడుతున్న బీబర్ వీడియో రకరకాల యాంగిల్స్ లో చక్కర్లు కొడుతోందిప్పుడు.