: కోల్ కతాలో 'లేడీ డాన్' సంగీత లాకర్ బద్దలు కొట్టిన చిత్తూరు పోలీసులు


రెడ్ శాండల్ స్మగ్లర్, లేడీ డాన్ సంగీత చటర్జీ కోల్ కతాలోని ఓ బ్యాంకులో నిర్వహిస్తున్న లాకర్ ను బద్దలుకొట్టిన చిత్తూరు పోలీసులు కోటి రూపాయలకు పైగా విలువైన బంగారు నగలతో పాటు, విలువైన వస్తువులు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు స్మగ్లర్ లక్ష్మణ్ రెండో భార్య అయిన సంగీత, భర్త జైలుకు వెళ్లిన తరువాత, ఆయన వ్యాపారాన్ని అన్నీ తానై నడిపించిన సంగతి తెలిసిందే. చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేయగా, బెయిల్ తెప్పించుకుని తప్పించుకు తిరుగుతున్న ఆమె పేరిట యూకో బ్యాంకులో ఉన్న లాకర్ ను తెరిపించేందుకు అధికారుల సమ్మతి పొందిన పోలీసులు, లాకర్లోని వస్తువులు చూసి అవాక్కయ్యారు. వజ్రాభరణాలు, ఎన్నో జతల గాజులు, బ్రేస్ లెట్లు, నక్లెస్ లు, గోల్డ్ చైన్లు ఆమె లాకర్ లో ఉన్నాయి. ఇవన్నీ అక్రమ సంపాదనలో భాగమేనని వెల్లడించిన పోలీసులు, సంగీత తన అనుచరుడు గురుస్వామి ద్వారా వీటిని లాకర్లో పెట్టించిందని తెలిపారు. కాగా, సంగీతను మరోసారి అరెస్ట్ చేసేందుకు నిన్న చిత్తూరు పోలీసుల బృందం కోల్ కతా కు బయలుదేరింది. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే, మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News