: శత వసంతాల స్నేహ త్రయం!


వారు ముగ్గురు చిన్ననాటి స్నేహితులు.. కలిసి పెరిగారు. పెద్దయ్యారు. అయినా ఏనాడూ స్నేహాన్ని వీడలేదు. జీవితంలో బిజీగా ఉన్నా తరచూ కలుసుకునేవారు. కుటుంబాల మధ్య అనుబంధాలు పెనవేసుకుపోయాయి. విశేషం ఏంటంటే, బాల్య స్నేహితులైన ఈ ముగ్గురూ ఒకేసారి వందేళ్ల బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకోవడం! బార్నెస్, బట్లర్, అండర్‌వుడ్, రూత్.. బాల్య స్నేహితులు. నైరుతి వాషింగ్టన్‌లో వీరు నలుగురు కలిసి తిరిగారు. ఆడిపాడారు. జియాన్ బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొనేవారు. జులై 1916లో జన్మించిన వీరిలో ముగ్గురు 1933లో ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చారు. 1968లో అమెరికాలో చెలరేగిన జాత్యహంకార గొడవలకు వీరు ప్రత్యక్ష సాక్షులు. చూస్తుండగానే వందేళ్లు గడిచిపోయాయి. అయితే మరో స్నేహితురాలు బార్నెస్ కూడా వందేళ్ల ఉత్సవంలో పాల్గొనాల్సిందే. కానీ దురదృష్టవశాత్తు ఈ మేలో ఆమె చనిపోయింది. శనివారం జియాన్ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన వందేళ్ల జన్మదిన వేడుకల్లో స్నేహితురాళ్లు ముగ్గురు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు బార్నెస్‌ నిలువెత్తు ఫొటో ముందు అంజలి ఘటించారు. బార్నెస్ తమ ముందు లేకపోవడం చాలా బాధగా ఉందని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. వాషింగ్టన్ మేయర్ ఓప్రా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ వీరికి ఓ వీడియోను పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వందేళ్లు జీవించడం అరుదే అయినప్పటికీ ముగ్గురు బాల్య స్నేహితులు ఒకేసారి వందేళ్లకు చేరుకోవడంతోపాటు ఉల్లాసంగా ఆ వేడుకల్లో పాల్గొని డ్యాన్స్ చేయడం మాత్రం మరింత అరుదనే చెప్పాలి.

  • Loading...

More Telugu News