: 'ఇందులో బాంబు ఉండొచ్చు'... కాశ్మీరీ అమ్మాయిలను సమస్యల్లో పడేసిన 'బ్యాగేజ్'పై రాత!
వారిద్దరూ కాశ్మీరీ విద్యార్థినులు. బంగ్లాదేశ్ లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారు. ఢాకా నుంచి వారి గ్రామానికి వెళ్లేందుకు విమానంలో ఢిల్లీకి వచ్చారు. శ్రీనగర్ వెళ్లాల్సిన విమానం ఎక్కేముందు వారు పెను సమస్యలో చిక్కుకుని విమానాన్ని మిస్ అయ్యారు. ఎవరు రాశారో ఏమో... వారి బ్యాగుపై 'ఇందులో బాంబు ఉండొచ్చు' అని రాశారు. దీన్ని చూసిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారిద్దరినీ ఆపేసిన భద్రతా సిబ్బంది పూర్తి తనిఖీలు చేసి, వారి వద్ద ఏ విధమైన అనుమానాస్పద వస్తువులూ లేవని తేల్చారు. దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించి వదిలారు. అప్పటికే వారు ప్రయాణించాల్సిన విమానం వెళ్లిపోగా, రాత్రంతా వారు వేచిచూడాల్సి వచ్చింది.