: మా పిల్లలు సినీ నటులు కావాలనుకోవట్లేదు: ఏంజెలీనా జోలీ
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలి పిల్లలకి నటన మీద ఆసక్తి లేదట. ఈ విషయాన్ని తనే చెబుతోంది. సినిమాలు చూడడానికి బాగుంటాయని వారు అభిప్రాయపడతారని, అయితే నటన రంగంలోకి రావడానికి మాత్రం వారు ఆసక్తి చూపడం లేదని ఏంజెలీనా తెలిపింది. ఈ హాలీవుడ్ అందాల తారకు మాడాక్స్ (14), పాక్స్ (12), జహారా (11), షిలో (10)లతో పాటు, కవలలు వివెన్నె, నాక్స్ (7).. మొత్తం ఆరుగురు పిల్లలున్నారు. వీరిలో మడాక్స్ కు ఎడిటింగ్, పాక్స్ కు సంగీతం, డీజేయింగ్ పై ఆసక్తి ఉందని చెప్పింది. ఈ ఆరుగురు ప్రస్తుతానికి ఏడు భాషలు నేర్చుకుంటున్నారని ఏంజెలీనా జోలీ తెలిపింది.