: తెలంగాణకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి పారికర్ ప్రకటన!


తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తుందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ భరోసా ఇచ్చారు. నేటి ఉదయం దుండిగల్ లో వైమానిక దళ కార్యక్రమానికి హాజరైన ఆయన కొద్దిసేపటి క్రితం ఆదిభట్ల సెజ్ లో టాటా బోయింగ్ ఏరో స్పేస్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలుస్తుందని ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News