: విజయశాంతి ఇంట్లో దొంగలు పడ్డారు!... నగలు చోరీ అయ్యాయని పోలీసులకు మాజీ ఎంపీ ఫిర్యాదు!


టాలీవుడ్ లో అగ్ర నటిగా ఎదిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన కాంగ్రెస్ పార్టీ నేత, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి ఇంట్లో దొంగలు పడ్డారు. విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు. నిన్న రాత్రి జరిగిన ఈ చోరీని నేటి ఉదయం గమనించిన ఆమె హైదరాబాదు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఇంటిలోకి చొరబడ్డ దొంగలు విలువైన నగలను ఎత్తుకెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎంపీ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు చోరుల కోసం గాలింపు మొదలుపెట్టారు. చోరీకి గురైన నగల విలువ ఎంత అన్న విషయం తెలియరాలేదు. మొన్నటిదాకా టీఆర్ఎస్ లో ఉన్న విజయశాంతి ఓ టెర్మ్ మెదక్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తో విభేదాల నేపథ్యంలో ఆమె ఆమధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News