: మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తారా.. దేశానికి రక్షణ ఎక్కడ?: శరద్ యాదవ్ మండిపాటు


మంత్రులు, పారిశ్రామికవేత్తల ఫోన్లను కార్పొరేట్ గ్రూప్ ట్యాపింగ్ చేసినట్టు వస్తున్న వార్తలపై జేడీయూ మాజీ చీఫ్, రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్ మండిపడ్డారు. ఈ విషయం తనను షాక్ కు గురిచేసిందని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇదెలా సాధ్యమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ప్రభుత్వ అనుమతి లేకుండా టెలిఫోన్లను ట్యాప్ చేయడం తీవ్రమైన నేరం. ప్రభుత్వ ఏజెన్సీలు ఎంత బలహీనంగా ఉన్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి నేరాలను మీడియా కంటే ముందే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాలి’అని ఆయన పేర్కొన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు చేసే ఇటువంటి పనులతో దేశ, ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని లేకుంటే పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తుతానని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News