: చరిత్ర సృష్టించేందుకు రెడీ.. నేటి నుంచి రంగంలోకి మహిళా యుద్ధ పైలట్లు


భారత వైమానిక రంగ చరిత్రలో నేటి నుంచి మరో అధ్యాయం మొదలుకాబోతోంది. ఫైటర్ జెట్లకు తొలి మహిళా పైలట్లుగా ఫ్లయింగ్ కేడెట్లు భావన కత్, అవని చతుర్వేది, మోహనసింగ్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరు ముగ్గురూ ఇప్పటికే మొదటి దశ 150 గంటల ఫ్లైయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ రోజు వారు పైలట్లుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మరో ఆరు నెలలపాటు వారికి అడ్వాన్స్డ్ జెట్ ఫైటర్ హాక్ ను నడపడంలో శిక్షణ ఇస్తారు. యుద్ధ విమాన పైలట్లుగా బాధ్యతలు స్వీకరించే వారిని ప్రత్యేకంగా ఏమీ చూడబోమని, ఎయిర్ ఫోర్స్ అవసరాన్ని బట్టి వారి సేవలను వినియోగించుకుంటామని ఎయిర్ చీఫ్ అరూప్ రాహా పేర్కొన్నారు. 20 ఏళ్ల వయసు దాటిన ఈ ముగ్గురు మహిళా యుద్ధ పైలట్లు శిక్షణ సమయంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. కష్టసాధ్యమైన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి భారత వైమానిక రంగంలో చరిత్ర సృష్టించారు. తొలి మహిళా యుద్ధ పైలట్లుగా చరిత్రలో తమపేర్లను లిఖించుకున్నారు.

  • Loading...

More Telugu News