: అన్నయ్య నమ్మితే కానీ ఏదీ చేయడు...సినిమా సూపర్ హిట్టే: అఖిల్


అన్నయ్య ఎంతో నమ్మితే కానీ ఏదీ చేయడని యువ నటుడు అఖిల్ తెలిపాడు. హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్ లో జరిగిన 'సాహసం శ్వాసగా సాగిపో' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని అన్నాడు. రెహమాన్ గారు చేసిన పాటలు అద్భుతమని అన్నాడు. సినిమా యూనిట్ కు ముందుగానే శుభాకాంక్షలని చెప్పాడు. గతంలో అన్నయ్య (నాగచైతన్య), గౌతమ్ మీనన్ గారు చేసిన 'ఏం మాయ చేశావే' సినిమాను మించి ఈ సినిమా హిట్ కావాలని ఆకాంక్షించాడు.

  • Loading...

More Telugu News