: రూ. 34 కోట్లతో లగ్జరీ ఫ్లాట్ కొన్న విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ముంబైలోని వర్లీ ప్రాంతంలో రూ. 34 కోట్లు పెట్టి ఓ లగ్జరీ అపార్టుమెంటును కొనుగోలు చేశాడు. ఇక్కడి ఓంకార్ రియల్టార్స్ అండ్ డెవలపర్స్ ప్రాజెక్టులోని టవర్ - సీలో 7,171 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ ఫ్లాట్ లో ఐదు బెడ్ రూములు ఉంటాయని, నేరుగా సముద్రాన్ని చూస్తూ కాలక్షేపం చేసే వీలుందని తెలుస్తోంది. గత సంవత్సరమే దీనిలో ఓ ఫ్లాట్ కొనాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అన్నట్టు మరో క్రికెటర్ యువరాజ్ ఇదే టవర్ లోని 29వ అంతస్తులో గతంలో ఓ ఫ్లాట్ కొన్నాడు. ఇప్పుడు 35వ అంతస్తులో కోహ్లీ కొన్న ఫ్లాట్ ఉంది.