: ఒడిదుడుకుల మధ్య లాభాల్లోకి మార్కెట్


సెషన్ ఆరంభంలోని భారీ లాభాలు ఆపై తీవ్ర ఒడిదుడుకుల మధ్య తగ్గుతూ వచ్చినప్పటికీ, చివరకు మాత్రం లాభాలే నమోదయ్యాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో క్రితం ముగింపు కంటే 200 పాయింట్లు పైగా లాభంలో ఉన్న సెన్సెక్స్ చివరకు 100 పాయింట్లతో సరిపెట్టుకుంది. తాజా గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ తెరపైకి రావడమే ఇందుకు కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 100.45 పాయింట్లు పెరిగి 0.38 శాతం లాభంతో 26,625.91 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 29.45 పాయింట్లు పెరిగి 0.36 శాతం లాభంతో 8,170.20 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.05 శాతం నష్టపోగా, స్మాల్ కాప్ 0.29 శాతం లాభపడింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 28 కంపెనీలు లాభపడ్డాయి. భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిడ్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, టాటా పవర్, ఇన్ ఫ్రాటెల్, సన్ ఫార్మా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,767 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,267 కంపెనీలు లాభాలను, 1,309 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గురువారం నాడు రూ. 1,00,19,117 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,00,49,157 కోట్లకు పెరిగింది.

  • Loading...

More Telugu News