: అతడిని బతికించిన వైద్యులే ఆశ్చర్యపోతున్నారు!


కొన్ని సంఘటనలు సైన్సుకి, మేధస్సుకి అందవు... అలా జరిగిపోతుంటాయంతే... వాటినే మనం అద్భుతాలంటాం. చైనాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్స్ లో ఓ వ్యక్తి 5 మీటర్ల ఎత్తు నుంచి కిందికి పడిపోయాడు. ఈ పడిపోవడం నిలువుగా ఓ ఇనుప ఊచ మీద పడిపోయాడు. 1.5 మీటర్ల ఆ ఊచ అతని శరీరంలోకి చొచ్చుకుపోయింది. దీంతో ఈ ఊచను కత్తిరించి అతనిని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఎక్స్ రే తీసిన వైద్యులు రిపోర్టు చూసి షాక్ తిన్నారు. ఎక్స్ రేలో ఆ ఇనుప ఊచ కపాలం, శ్వాసనాళం, గుండె, గళధమని, కాలేయం పక్కనుంచి సుమారు 1.5 మీటర్లు చొచ్చుకుపోయింది. దీంతో జాగ్రత్తగా ఆపరేషన్ చేసిన వైద్యులు, ఆ ఊచను తొలగించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో వైద్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. రెండు వారాల పాటు అతనిని అబ్జర్వేషన్ లో ఉంచామని, ఊచ అతని కీలక భాగాలకు తాకకుండా, వాటి పక్క నుంచి వెళ్లినందువల్ల అతని ప్రాణాలు నిలిచాయని, ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News