: తెలంగాణ టెట్-2016 ఫలితాలు విడుదల
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2016 ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కిషన్ టెట్ ఫలితాలను విడుదల చేశారు. పేపర్-1లో 54.45శాతం ఉత్తీర్ణత నమోదయింది. పేపర్-2లో 25.04శాతం ఉత్తీర్ణత నమోదయింది. పేపర్-1లో 134మార్కులతో మెదక్ జిల్లా అభ్యర్థి స్నేహలత మొదటి ర్యాంకు సాధించారు. పేపర్-2 మాథ్స్, సైన్స్ విభాగంలో 126మార్కులతో శారదావాణి తొలిర్యాంకు సాధించారు. పేపర్-2 సోషల్ విభాగంలో 122మార్కులతో టి.హరిబాబు ప్రథమ స్థానంలో నిలిచారు.