: ఉడ్తా పంజాబ్ కు 89 కట్సే... హార్దిక్ ఉద్యమంపై చిత్రానికి 100 కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డు


పంజాబ్ లో జరుగుతున్న డ్రగ్స్ మాఫియాపై తీసిన 'ఉడ్తా పంజాబ్' చిత్రానికి 89 కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డు వార్తల్లోకి నిలిచి విమర్శలను ఎదుర్కొన్న విషయాన్ని మరవకముందే గుజరాత్ లో జరుగుతున్న పటేళ్ల ఉద్యమం ఆధారంగా తీసిన 'సడక్తో సవాల్: అనామత్' చిత్రానికి సెన్సార్ బోర్డు 100 కట్స్ చెప్పింది. వచ్చే వారంలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం తెరలను తాకితే, కొత్త ఉద్యమాలు రావచ్చని సెన్సార్ బోర్డు అభిప్రాయపడుతోంది. "ఈ సినిమా హార్దిక్ పటేల్ మీద తీసినట్టు బోర్డు మాకు చెప్పింది. కానీ అది వాస్తవం కాదు. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాలను తప్పుగా చూపారని కూడా మాతో అన్నారు. అది కూడా వాస్తవ దూరం. మేము మరోసారి రివ్యూ చేయాలని కోరాం" అని చిత్ర దర్శకుడు రాజేష్ గోహిల్ తెలిపారు. ఈ చిత్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉండదని చెబుతున్న ఆయన, సినిమాను విడుదలకు ముందే చూడాలని ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ను కోరారు. ఆమెకేమైనా అభ్యంతరాలుంటే కొన్ని సీన్స్ మార్చేందుకు సిద్ధమని నిర్మాత మహేష్ పటేల్ తెలిపారు.

  • Loading...

More Telugu News