: మానవత్వానికి నోచుకోని మృతదేహం!


ప్రస్తుతం 'అవినీతి భారతం' ఎలా ఉందన్న దానికి నిదర్శనం ఈ సంఘటన. మానవత్వం అడుగంటిందన్న దానికి సాక్ష్యమీ ఘటన. మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటనను చూస్తే సమాజం ఇలా అయిపోయిందా? అని ఆశ్చర్యపోకతప్పదు. అక్కడి సిద్ధి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను దగ్గర్లోని పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని బంధువులు కనీసం మృతదేహం తీసుకెళ్లేందుకు అంబులెన్స్ అయినా ఇవ్వాలని ఆసుపత్రి వర్గాలను కోరారు. అయితే, వారు నిరుపేదలని తెలియడంతో, తనకు మామూలు ఇవ్వరని భావించిన అంబులెన్స్ డ్రైవర్ ఆ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో ఆ మృతదేహాన్ని వెదురు బొంగుకు కట్టుకుని ఇద్దరు వ్యక్తులు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి మోసుకెళ్లారు. ఇదీ చెదలుపట్టిన మన మానవత్వం!

  • Loading...

More Telugu News