: కిలో టమోటా ఆన్ లైన్ లో 30 రూపాయలే!
బహిరంగ మార్కెట్ లో టమోటా కొనాలంటే నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇతర కూరగాయల సంగతెలా ఉన్నా ప్రతి కూరలో ఉండాల్సిన టమోటా మాత్రం కొండెక్కి కూర్చుంది. దీంతో అధికారులు టమోటా ధరను కిందికి దించే ప్రయత్నాలు మొదలుపెట్టగా, ఆన్ లైన్ లో మాత్రం టమోటాలు సరసమైన ధరకే లభిస్తున్నాయి. కేవలం మెట్రో పట్టణాల్లో మాత్రమే ఆన్ లైన్ సేవలందిస్తున్న ఫ్రెష్ ఫల్ సబ్జి, గ్రోసర్స్ తదితర ఆన్ లైన్ వెబ్ సైట్లు కేజీ టమోటాను 30 రూపాయల నుంచి 50 రూపాయల మధ్య విక్రయిస్తున్నాయి. దీంతో ఆన్ లైన్ కొనుగోలు దారులకు టమోటాలు సరసమైన ధరకే లభించడం విశేషం.