: ఇంకా దీక్ష చేస్తే ముద్రగడకు ప్రాణాపాయం: వైద్యులు


ముద్రగడ పద్మనాభం తక్షణం ఆహారం తీసుకోవాలని, లేకుంటే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కాకినాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు హెచ్చరించారు. ముద్రగడ ఆరోగ్యంపై ఈ మధ్యాహ్నం మీడియాకు వివరాలు అందించిన వైద్యులు, ఆయన ఎలాంటి ఆహారమూ తీసుకోవడం లేదని తెలిపారు. ముద్రగడకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని వివరించారు. తనకు బాగానే ఉందని ఆయన చెబుతున్నప్పటికీ, రక్తపోటు క్రమంగా పడిపోతున్నదని, ఇది ప్రమాదకర స్థాయికి చేరకముందే దీక్షను విరమించాలని తాము సూచిస్తున్నామని పేర్కొన్నారు. మరింతకాలం దీక్షను కొనసాగిస్తే, ప్రమాదమున్న కారణంగా, దీక్షను విరమించేందుకు ఒప్పించాలని బంధువులను కోరుతున్నట్టు తెలిపారు. సెలైన్ ఎక్కించేందుకు మాత్రం ఆయన సహకరించారని తెలియజేశారు.

  • Loading...

More Telugu News