: తెలంగాణ సర్కారుకు మరో మొట్టికాయ!... జీవో నెం:123 ప్రకారం భూసేకరణకు హైకోర్టు ససేమిరా!
కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సర్కారుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు విధానపరమైన నిర్ణయాల్లో కేసీఆర్ సర్కారుకు మొట్టికాయలేసిన హైకోర్టు... కొద్దిసేపటి క్రితం మరో షాకిచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూ సేకరణ కోసం జీవో నెం: 123ని ప్రయోగించడం కుదరదని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. అంతేకాకుండా మెజారిటీ రైతులు డిమాండ్ చేసే ధరలనే చెల్లించి భూములను సేకరించాలని కూడా పకడ్బందీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో షాక్ తిన్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.