: అభిమానులకు మహేశ్ బాబుతో కలసి నటించే అవకాశమిస్తున్న మురుగదాస్


సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి నటించే అవకాశాన్ని అభిమానులకు దగ్గర చేయాలని దర్శకుడు మురుగదాస్ నిర్ణయించారు. 'బ్రహ్మోత్సవం' తదుపరి చిత్రంగా మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని పాత్రలకు మహేశ్ అభిమానులు కావాలని భావించిన మురుగదాస్, అభిమానుల కోసం ప్రత్యేక ఆడిషన్స్ చేపట్టారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని చిత్ర నిర్మాణ సంస్థలో ఇవి జరుగుతున్నాయని సమాచారం. కాగా, 'ఎనిమీ' వర్కింగ్ టైటిల్ తో వచ్చే నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా మహేశ్ కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News