: ఇల్లాలికి పని అప్పగిస్తే ఇక విడాకులే!: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
కట్టుకున్న భార్యలకు పని అప్పగిస్తే, ప్రమాదంలో పడ్డట్టేనని, ఇందుకు తన జీవితమే ఉదాహరణని రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రైమ్ టైమ్ లైవ్'లో ఆయన మాట్లాడుతూ, తన మాజీ భార్య ఇవానాకు వ్యాపారం అప్పగించడం వల్లే, తమ మధ్య బంధం విడాకుల వరకూ వెళ్లిందని ఆయన చెప్పుకొచ్చారు. అట్లాంటిక్ సిటీ కాసినోస్ బాధ్యతలు ఇవానాకు అప్పగించానని గుర్తు చేసుకున్న ఆయన, అప్పటివరకూ సున్నితంగా ఉన్న ఆమె, కంపెనీలో చేరాక మొరటుగా మారిందని అన్నారు. అయితే, పురుషుల కన్నా మహిళలు తమ విధులను చక్కగా నిర్వహిస్తారన్న ఆయన, తన జీవితంలో తొలి విడాకులకు కారణం మాత్రం పెళ్లానికి పని అప్పగించడమే నని తెలిపారు. కాగా, దాదాపు 22 సంవత్సరాల క్రితం ఇవానా నుంచి విడిపోయిన సమయంలో తొలిసారిగా, ఆపై ఇటీవల ప్రైమ్ టైమ్ లైవ్ లోనూ ట్రంప్ ఇదే వ్యాఖ్య చేయడం గమనార్హం.