: విశాఖలో కలకలం!... సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని పాడేరు ఏఎస్పీ ఆత్మహత్యాయత్నం


విశాఖపట్నం జిల్లాలో నేటి ఉదయం ఓ వార్త కలకలం రేపింది. జిల్లాలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం పాడేరుకు అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న పోలీసు అధికారి శశికుమార్ ఆత్మహత్యాయత్నం చేశారు. తన అధికారిక నివాసంలోనే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన తన సర్వీస్ రివాల్వర్ తీసుకుని తనను తాను కాల్చుకున్నారు. ఈ ఘటనలో శశికుమార్ కు తీవ్ర గాయలయ్యాయి. బుల్లెట్ గాయాలతో కిందపడిపోయిన ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News