: రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తా.. నేను నెగ్గితే వైఎస్సార్సీపీని మూసేస్తారా?: జగన్ కు భూమా సవాల్
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సవాల్ విసిరారు. పార్టీ మారిన వారు 30 కోట్లు తీసుకున్నారనడం, రాజీనామా చేసి పార్టీ మారాలని పదేపదే విమర్శలు చేయడం ఆపాలని భూమా అన్నారు. అందుకోసం తన పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని, తాను గెలిస్తే వైఎస్సార్సీపీని మూసేస్తారా? అని ఆయన సవాల్ విసిరారు. లేనిపోని విమర్శలు చేస్తూ కాలం గడపొద్దని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆయన జగన్ కు సూచించారు.