: కర్ణాటక డీఎస్పీ అనుపమ రాజీనామాలో లేటెస్ట్ ట్విస్ట్.. మంత్రి ప్రస్తావన లేకుండా రాజీనామా లేఖ ఇవ్వాలని ఒత్తిడి!


కర్ణాటకలో గత 15 రోజులుగా రాజకీయ దుమారం రేపుతున్న బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్‌పీ అనుపమ షెనాయ్ రాజీనామాలో సరికొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కర్ణాటక మంత్రి పరమేశ్వర్ నాయక్ తన విధుల్లో జోక్యం చేసుకుని ఆటంకం కలిగించారని, తనన బెదిరించారని ఆరోపిస్తూ ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఫేస్ బుక్ పేజ్ లో పలు పోస్టులు మంత్రికి వ్యతిరేకంగా రాగా, ఆమె లీవులో వెళ్లిపోయారు. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిన ఆమె వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖలో మంత్రి పరమేశ్వర్ నాయక్ పేరు ప్రస్తావిస్తూ ఆయనపై ఆరోపణలు చేస్తూ, ఆమె రాజీనామా చేయడంతో తొలుత దానిని అంగీకరించలేదని, ఆయన పేరు లేకుండా రాజీనామా లేఖ ఇవ్వాలని వారు ఆమెపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె ఆయన ప్రస్తావించకుండా మరో రాజీనామా లేఖ సమర్పించగా, దానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News