: టీమిండియా క్లీన్ స్వీప్...మ్యాన్ ఆప్ ది సిరీస్ రాహుల్
టీమిండియా సత్తా చాటింది. జింబాబ్వే సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు చిబాబా (27), సిబంద (37), మురుమా (17), మద్జివా (10*) రాణించడంతో 42.2 ఓవర్లలో 123 పరుగులు చేసింది. అనంతరం 124 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో రంగ ప్రవేశం చేసిన రాహుల్, ఫజల్ ఆరంభాన్ని ఘనంగా చాటుకున్నారు. తొలుత ఆచి తూచి ఆడిన వీరిద్దరూ క్రమంగా జోరు పెంచుతూ పోయారు. వీరిద్దరి ధాటికి టీమిండియా మూడో వన్డేలో పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో రాహుల్ 63 పరుగులు చేయగా, ఫజల్ 55 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు 21.5 ఓవర్లలో 126 పరుగులు చేసింది. తొలి వన్డేలో సెంచరీ, మూడో వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రాహుల్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.