: ఆల్ టైం క్రికెట్ టాప్-4 కీపర్లలో ధోనీ
భారత జట్టు క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంకో రికార్డును నమోదు చేశాడు. ఆల్ టైం క్రికెట్ టాప్-4 కీపర్లలో ఒకడిగా చేరాడు. నేడు జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో చిగుంబరా బ్యాటును తాకిన బంతిని క్యాచ్ పట్టడం ద్వారా 350 మందిని అవుట్ చేసిన ఘనతను దక్కించుకున్నాడు. తన 278వ వన్డే పోరులో ధోనీ ఈ రికార్డును సాధించగా, అత్యధికులను పెవీలియన్ దారి పట్టించిన కీపర్లలో తొలి స్థానంలో సంగక్కార 482 అవుట్ లతో నిలిచాడు. ఆ తరువాత గిల్ క్రిస్ట్ 472 మందిని, బౌచర్ 424 మందిని అవుట్ చేసి తొలి మూడు స్థానాల్లో ఉండగా, ధోనీ నాలుగో ప్లేస్ లో నిలిచాడు.