: కేసీఆర్ స‌మ‌క్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న గుత్తా, వివేక్, వినోద్, భాస్క‌ర్ రావు


హైద‌రాబాద్‌లోని టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, వివేక్‌, వినోద్‌, భాస్క‌ర్ రావు, జువ్వాడి న‌ర్సింగ్ రావుతో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ నేత‌ల‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటోన్న సంద‌ర్భంగా టీఆర్ఎస్ భ‌వ‌న్‌కి టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు భారీగా చేరుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బ‌లం ఇప్పుడు 13కు ప‌డిపోయింది. త‌మ పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ నేత‌ల‌తో అధికార టీఆర్ఎస్ పార్టీ బ‌లం 90కి చేరింది.

  • Loading...

More Telugu News