: మళ్లీ పాత కథే... 123 పరుగులకు చాప చుట్టేసిన జింబాబ్వే!
పాత కథే పునరావృతమైంది. జింబాబ్వే సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ కు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ చిబాబా (27), సిబంద (37), మురుమా (17), మద్జివా (10*) రాణించడంతో జింబాబ్వే జట్టు 42.2 ఓవర్లలో 123 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో రాణించగా, చాహల్ రెండు, కులకర్ణి, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. దీంతో 124 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించనుంది. కాగా, కరుణ్ నాయర్ స్థానంలో ఫయాజ్ ఫజుల్ ఈ వన్డేతో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. కాసేపట్లో కేఎల్ రాహుల్ కు జతగా ఫయాజ్ ఫజుల్ బ్యాటింగ్ ప్రారంభించనున్నాడు. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.