: జమ్మూలో పురాత‌న ఆల‌యం ధ్వంసం.. ఉద్రిక్తత‌.. మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత‌


జ‌మ్మూ రూప్ నగర్‌లోని ఓ పురాత‌న ఆల‌యంలోకి ప్ర‌వేశించిన ఓ మ‌తిస్థిమితం లేని వ్య‌క్తి ఆ ఆల‌యాన్ని ధ్వంసం చేశాడు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తాము ఇన్నాళ్లూ పూజ‌లు జ‌రుపుతోన్న పురాత‌న ఆల‌యం ధ్వంసం కావ‌డం ప‌ట్ల స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ విధ్వంసం సృష్టించారు. అక్క‌డి మూడు వాహ‌నాలకు ఆందోళ‌న‌కారులు నిప్పంటించారు. ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. దీంతో అక్క‌డ యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. రూప్ న‌గ‌ర్‌కి భారీగా చేరుకున్న పోలీసులు అక్క‌డి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మొబైల్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను బంద్ చేశారు. పరిస్థితి చక్కబడ్డాక మళ్లీ వాటిని పునరుద్ధరిస్తామని పోలీసులు తెలిపారు. పురాత‌న ఆల‌యాన్ని ధ్వంసం చేసిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు.

  • Loading...

More Telugu News