: 35 ఏళ్లలోనూ ఫుల్ ఫిట్ గా జార్ఖండ్ డైనమైట్!... వీడియో విడుదల చేసిన బీసీసీఐ!


టీమిండియా లిమిటెడ్ ఓవర్ల జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అప్పుడే 35 ఏళ్ల వయసు వచ్చేసింది. టీమిండియా కెప్టెన్లలోకెల్లా విజయవంతమైన కెప్టెన్ గా రికార్డులకెక్కిన మహేంద్రుడు... వయసు మీద పడుతున్నా ఫిట్ నెస్ సడలని ప్రపంచ క్రికెటర్లలో ఒకడిగానూ రికార్డులకెక్కుతున్నాడు. ప్రస్తుతం అంతా కుర్రాళ్లతో కూడిన యువ జట్టును తీసుకుని జింబాబ్వే టూర్ కు వెళ్లిన ధోనీ... అక్కడి జిమ్ ల్లో కుస్తీలు పడుతూ కుర్రాళ్లకు ఫిట్ నెస్ మార్గదర్శనం చేస్తున్నాడు. 35 ఏళ్ల వయసులోనూ ధోనీ కసరత్తులు చేస్తూ ఫుల్ ఫిట్ గా ఉన్నాడు చూడండి అంటూ బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ఓ వీడియోను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News