: 24 రీళ్లు పూర్తయినా జగన్‌కు సినిమా అర్థం కాదు: ఆనం రాంనారాయణ
విజయవాడలో వైసీపీ జరిపిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని తెలుగు సినిమాల్లోని విలన్‌గా అభివర్ణించడాన్ని టీడీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి తిప్పి కొట్టారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘24 రీళ్లు పూర్తయినా జగన్‌కు సినిమా అర్థం కాదు’ అని ఎద్దేవా చేశారు. ‘జగనే రాష్ట్రానికి అసలైన విలన్’ అని ఆయన అన్నారు. ‘జగన్ హావభావాలు చూస్తే విలనే గుర్తుకొస్తార’ని ఆయన అన్నారు. ఆయన ఎప్పటికీ హీరో కాలేరని ఆనం అన్నారు. చంద్రబాబే అసలైన హీరో అని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో జగన్‌కి పతనం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.