: ముద్రగడకు తక్షణమే వైద్యం అందించాలి, ఆయన అంగీకరించడం లేదు: వైద్యులు
తుని ఘనటలో అరెస్టులకు నిరసనగా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఆమరణ నిరశనను కొనసాగిస్తోన్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొద్ది సేపటి క్రితం వైద్యులు ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వైద్య పరీక్షలకు ముద్రగడ పద్మనాభం అంగీకరించడం లేదని వారు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించకుండా ఉండేందుకు ఆయనకు తక్షణం వైద్యం అందించాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. ఆయనకు బలవంతంగా వైద్యం చేయించే స్థితిలో తాము లేమని పేర్కొన్నారు.