: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరుస భూ ప్రకంపనలు!... రాత్రంతా రోడ్లపైనే జనం జాగారం!
భూ ప్రకంపనలతో దద్దరిల్లుతున్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలు... గడచిన 24 గంటల్లో వరుసగా మూడు సార్లు కంపించిపోయాయి. నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, ఏఎస్ పేట, ఉదయగిరి మండలాలు, ప్రకాశం జిల్లాలోని పామూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈ తాజా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నిన్న ఉదయం నుంచి 24 గంటల వ్యవధిలోనే వరుసగా మూడు సార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం బెంబేలెత్తిపోయారు. రాత్రి రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం... ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత రాత్రంతా వారు రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.