: అమరావతిలోనైనా, హైదరాబాద్‌లోనైనా చర్చించడానికి కేసీఆర్ సిద్ధం: బూర నర్సయ్య
తెలుగు రాష్ట్రాల మధ్య చెలరేగుతోన్న జలవివాదంపై టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్పందించారు. హరీశ్‌రావు జల సమస్యను పరిష్కరించుకొనే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారని ఆయన అన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలపై భేటీ అయి సమస్య పరిష్కరించుకుందామని హరీశ్ లేఖలో విజ్ఞప్తి చేశారని బూర నర్సయ్య పేర్కొన్నారు. కృష్ణా నీటిలో నాలుగు రాష్ట్రాలు వాటాలు పంచుకోవాలని ఆయన అన్నారు. వీటిపై రాజకీయం చేయాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలోనైనా, హైదరాబాద్‌లోనైనా దీనిపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు విభజన కూడా త్వరగా జరగాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ దీనికోసం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.