: నీ బావమరిది సినిమాలే చూడాలా బాబూ?: కొడాలి నాని నిప్పులు


చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలను ప్రసారం చేస్తున్నారన్న కారణంతోనే, అధికారముందని సాక్షి టెలివిజన్ ప్రసారాలను నిలిపివేశారని, తాము తలచుకుంటే ఏపీలో ఒక్క చానల్ కూడా రాకుండా చేస్తామని వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. విజయవాడలో జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ సొంత జాగీరనుకుంటున్నారా? మీ బావమరిది, మీ తమ్ముడి కొడుకు సినిమాలే టీవీలో చూడనిస్తారా? ప్రజలకు నచ్చిన చానళ్లను చూడనివ్వరా? సాక్షి టీవీ ప్రసారాలను తిరిగి పునరుద్ధరించకుంటే చూస్తూ ఊరుకోబోము. వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తున్న చానళ్లను అడ్డుకోవడం అత్యంత దారుణం" అని అన్నారు. తన మామ ఎన్టీఆర్ ప్రాణాలతో ఉండగానే, వెన్నుపోటు పొడిచి, ఆయన్ను గెంటేసి సీఎం పదవిని లాక్కొన్న ఘనుడు చంద్రబాబని నాని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News