: ఇండియాకు తొలిసారి వచ్చిన 'ది మమ్మీ' హీరో బ్రెండన్ ఫ్రేజర్


దాదాపు ఒకటిన్నర దశాబ్దం క్రితం హాలీవుడ్ లో విడుదలై, ఇండియాలోనూ సూపర్ హిట్టయిన 'ది మమ్మీ' చిత్రం గుర్తుందిగా? ఆపై 'మమ్మీ రిటర్న్', 'ది మమ్మీ - టూంబ్ అండ్ ది డ్రాగన్ ఎంపరర్' చిత్రాలూ వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. ఆ చిత్రాల హీరో బ్రెండన్ ఫ్రేజర్ తొలిసారిగా ఇండియా పర్యటన కోసం వచ్చాడు. ఆయన రహస్యంగా వచ్చినప్పటికీ, కొన్ని చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 47 ఏళ్ల ఈ హాలీవుడ్ స్టార్, రోహిత్ బాత్రా తీస్తున్న ఓ ఆంగ్ల చిత్రంలో నటించేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రోనిత్ రాయ్, నీరజ్ కాబి, ప్రేమ్ చోప్రా తదితరులూ నటిస్తున్నారట. ఇండియాలో సంస్కృతి, సంప్రదాయాలను తాను చానాళ్లుగా వింటున్నానని, అక్కడికి తప్పకుండా వెళతానని గతంలో చాలా సార్లు చెప్పిన ఫ్రేజర్, తొలి పర్యటన మంచి అనుభూతులను మిగల్చాలని ఆశిద్దాం.

  • Loading...

More Telugu News