: జీడీపీ పెరిగితే ఆదాయం పెరిగినట్టే కదా?: లా పాయింట్ తీసిన ధర్మాన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీడీపీ పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, ఆ మేరకు ఆదాయం పెరిగినట్టు ఎందుకు చెప్పడం లేదని వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఆదాయం పెరిగితేనే జీడీపీ పెరుగుతుందన్న విషయం తెలియని ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తుండటం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన, చంద్రబాబు పాలనను తప్పుబట్టారు. పట్టిసీమ ప్రాజెక్టును కమీషన్ల కోసమే చేపట్టారని విమర్శించారు. ప్రతి పనిలో తెలుగుదేశం నేతలకు ముడుపులు అందుతున్నాయని, ఆఖరికి వృద్ధులకు ఇస్తున్న రూ. 1000 పింఛనులో, గ్రామ కమిటీలు రూ. 100 నొక్కేస్తున్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News