: హైద‌రాబాద్‌, ఎల్బీనగర్‌ సితార హోట‌ల్‌లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం


హైద‌రాబాద్ శివారు ఎల్బీనగర్‌లోని సితార హోటల్‌లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. హోట‌ల్‌లో బ‌స చేస్తోన్న ఓ యువతిపై హోట‌ల్ రిసెప్ష‌నిస్ట్‌ అత్యాచార‌య‌త్నం చేశాడు. కామాంధుడి నుంచి తప్పించుకున్న యువతి ఎల్బీనగర్‌ పోలీస్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. బాధిత యువ‌తి విశాఖ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. విశాఖ‌లోని ఓ ప్రైవేటు సంస్థ‌లో ఆమె మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తోంది. యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డ్డ రిసెప్ష‌నిస్టు పేరు శేఖ‌ర్ అని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. నిర్భ‌య చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి, ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News