: నా కొడుకు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడు కాదు: ఓర్లాండో హంతకుడి తండ్రి
అమెరికాలోని పల్స్ గే క్లబ్ పై దాడికి దిగిన ఒమర్ మతీన్ ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ సానుభూతిపరుడు కాదని అతని తండ్రి సిద్ధిఖీ మతీన్ చెప్పారు. ఈ ఘటనపై ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. దీనిలో ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు పోలీస్ అధికారి కావాలని కలలు కన్నాడని అన్నారు. ప్రతి రోజూ నాలుగు సార్లు మసీదుకి వెళ్లేవాడని అన్నారు. తన పని తాను చూసుకునేవాడని ఆయన చెప్పారు. ఈ దాడికి 12 గంటల ముందు తమ ఇంటికి వచ్చాడని, అప్పుడు ఎలాంటి ఆందోళన కానీ ఆగ్రహం కానీ కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. తన కుమారుడు నైట్ క్లబ్ పై దాడికి పాల్పడ్డాడని తెలియగానే షాక్ కు గురయ్యానని ఆయన తెలిపారు.